Rayachoti: గాలివీడులో కూటమి ప్రచార జోరు: సుగవాసి ప్రసాద్ బాబు!
Rayachoti: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుగవాసి ప్రసాద్ బాబు, మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డితో కలిసి ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Rayachoti: గాలివీడులో కూటమి ప్రచార జోరు: సుగవాసి ప్రసాద్ బాబు!
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలోని తూముకుంట, వెలిగల్లు గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా సాగింది. శ్రీ సీతారామాలయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించిన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాలివీడు ZPTC అభ్యర్థి శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీ మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారితో కలిసి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అడుగడుగునా ప్రజల ఆత్మీయ పలకరింపులు… మహిళల మంగళహారతులు… పూలదండలతో ఘన స్వాగతాలు… కార్యకర్తల నినాదాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో నాయకులు ముందుకు సాగారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నాయకులు ప్రచారాన్ని కొనసాగించారు. పాలకొండరాయుడు గారి కుటుంబ వారసత్వం… ప్రజలతో విడదీయలేని అనుబంధం… గాలివీడు అభివృద్ధే లక్ష్యం!
ప్రజల ఆదరాభిమానాల మధ్య సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నవంబర్ 5న గురువారం జరిగే ఎన్నికల రోజున గాలివీడు మండల ప్రజలు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి, వేయించి, తెలుగుదేశం పార్టీ ZPTC అభ్యర్థి శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.




