Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు!

Rayachoti:రామపురం మండలం సుద్దమల్ల, యర్రమరెడ్డిపల్లెలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 20 Sept 2026 9:23 AM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు!

Rayachoti: రామాపురం మండలంలోని సుద్దమల్ల గ్రామం తొట్టివారిపల్లెకు చెందిన వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది. నిమజ్జనంలో భాగంగా వినాయక విగ్రహాన్ని భక్తులు, యువత మేళతాళాలు, నృత్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు.

ఈ క్రమంలో యర్రమరెడ్డి గారిపల్లెలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి నివాసం ఎదుటకు వినాయక విగ్రహం చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి భక్తులకు ఆత్మీయంగా అభినందనలు తెలిపారు. ఈ వేడుకలలో భక్తులు, యువతతో కలిసి శ్రీకాంత్‌రెడ్డి భాగస్వామ్యం అయ్యారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI