Galiveedu: గాలివీడులో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు భూమి పూజ: లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
Galiveedu: గాలివీడు మండలం అరవీడు గాండ్లపల్లిలో 33/11 కేవీ నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు.
Galiveedu: గాలివీడులో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు భూమి పూజ: లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
Galiveedu: గాలివీడు మండలంలోని అరవీడు గ్రామం గాండ్లపల్లి దగ్గర 33/11 కేవీ కొత్త సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ శ్రీ "మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి" గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి టెంకాయ కొట్టి భూమి పూజ చేసినారు.
ఈ సబ్ స్టేషన్ నిర్మాణం 4 నెలల్లోపు పూర్తి చేసి రైతులకు, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని. నిరంతరం విద్యుత్ సరఫరా ఉంటుందని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు మరియు టీడీపీ మండల అధ్యక్షులు పురం హేమకుమార్ రెడ్డి, టీడీపి సీనియర్ నాయకుడు మందపాటి రవీంద్ర బాబు గారు తో పాటు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.




