Rayachoti: రాయచోటిలో సీపీఐ (ఎంఎల్‌) ఆధ్వర్యంలో ధర్నా!

Rayachoti: రాయచోటి ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల పొలాల దారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Oct 2026 3:40 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో సీపీఐ (ఎంఎల్‌) ఆధ్వర్యంలో ధర్నా!

Rayachoti: రైతుల పొలాలకు దారి చూపాలని రాయచోటి ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం. సిసిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం సిపిఐ( ఎంఎల్) లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ చిన్నమండెం మండలం బలిజపల్లి రైతులకు పొలాల వద్దకు పోవడానికి దారిని లేకుండా చేయడం చాలా దారుణం అన్నారు చాయి బండ చెరువు కింద ఉన్నటువంటి రైతు పొలాలకు దారి లేకుండా చేశారని ఆయన అన్నారు.

ఈ సమస్య పైన అధికారుల దృష్టికి రైతులు ఎన్నోసార్లు తీసుకుపోయిన పట్టించుకోవడంలేదని రైతులు వాపోయారు అని ఆయన అన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న దారిని కొంతమంది కబ్జా చేసి మిగతా రైతులను ఇబ్బందులు పాలు చేయడం చాలా అన్యాయమని అన్నారు ఇప్పటికైనా వెంటనే రైతుల పొలాల వద్దకు పోవడానికి దారిని కొలిపించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేసి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం ఆర్డిఓ శ్రీనివాస్ గారికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం సుజాత రైతులు రజిని చలపతి విశ్వనాథం నాగరాజా సుహాసిని రత్నమ్మ భారత రైతులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI