Rayachoti: రాయచోటి కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి!
Rayachoti: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి అవగాహన ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, అధ్యాపకులు.
Rayachoti: రాయచోటి కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి!
Rayachoti: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో శుక్రవారం ఎన్‌సీసీ కోఆర్డినేటర్ బి. కిరణ్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు యు. ప్రసాద్, ఎ. ఖాజా ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. శ్రీనివాసరావు సూచనల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. ఎ. శ్రీనివాసరావు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు గాంధీజీ ఆశయాలు, అహింస, సత్యం, స్వచ్ఛత, దేశభక్తి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లతో కళాశాల నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.




