Rayachoti: రాయచోటిలో ఘనంగా చిక్కడ్ సాహెబ్ ఉరుసు ఉత్సవాలు
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో అక్టోబర్ 2న గంధం, 3న చిక్కడ్ సాహెబ్ ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ తెలిపింది.
Rayachoti: రాయచోటిలో ఘనంగా చిక్కడ్ సాహెబ్ ఉరుసు ఉత్సవాలు
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ కేంద్రమైన రాయచోటి పట్టణంలోని బండ్లపెంటలో వెలిసిన (హజ్రత్ సయ్యద్ మాలిక్ షా) 'చిక్కడ్ సాహెబ్' అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం గంధం, 3వ తేదీ శనివారం ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ చైర్మన్ మహమ్మద్ యూసుఫ్, సెక్రెటరీ ఎస్కే మోధ్దీన్, దర్గా ఇంచార్జ్ యునూస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గంధం రోజు మధ్యాహ్నం గొప్ప అన్నదాన కార్యక్రమం, అనంతరం ముషాయిరా ఉంటుందని తెలిపారు. ఉరుసు రోజు రాత్రి 9 గంటలకు గొప్ప ఖవాలి పోటీ ప్రముఖ టీవీ సింగర్స్ అజీమ్ నాజ, సుల్తానా నాజా ఇద్దరి కళాకారుల మధ్య గొప్ప ఖవాలి పోటీ ఉంటుందని చెప్పారు.
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సాహెబ్ భక్తులు పాల్గొంటారని, వచ్చిన భక్తులకు దర్గా కమిటీ వారు అన్ని వసతులు,భోజన సౌకర్యం కల్పించనున్నారు. ఈ ఉరుసు ఉత్సవాలను హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి విజయవంతం చేయాలని వారు కోరారు.




