Rayachoti: రాయచోటిలో టీడీపీకి భారీ ఊపు చేరిన 100 కుటుంబాలు!

Rayachoti: రాయచోటి మున్సిపాలిటీ 7వ వార్డులో వైసీపీకి భారీ షాక్. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన 100 కుటుంబాలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 15 Oct 2026 9:50 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో టీడీపీకి భారీ ఊపు చేరిన 100 కుటుంబాలు!

Rayachoti: రాయచోటి మున్సిపాలిటీలోని 7వ వార్డు మాజీ కౌన్సిలర్, ఎస్‌ఆర్‌ఎస్ లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని ఇర్ఫాన్‌తో పాటు తాజ్, జిలాని వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి ఆధ్వర్యంలో మరో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎన్ కాలనీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI