Ramapuram: జడ్పీటీసీగా పప్పిరెడ్డి హరిప్రియ ఏకగ్రీవ ఎన్నిక!
Ramapuram: రామాపురం జడ్పీటీసీగా పప్పిరెడ్డి హరిప్రియ ఏకగ్రీవం. సహకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు, మండల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటన.
Ramapuram: జడ్పీటీసీగా పప్పిరెడ్డి హరిప్రియ ఏకగ్రీవ ఎన్నిక!
రామాపురం: అన్నమయ్య జిల్లా రామాపురం మండలం జడ్పీటీసీగా పప్పిరెడ్డి హరిప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, మౌర్యా రెడ్డిలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
జడ్పీటీసీగా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, రామాపురం మండల అభివృద్ధికి కృషి చేస్తానని హరిప్రియ తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించి, మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.




