Ramapuram: పదవీకాలం ముగిసిన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

Ramapuram: రామాపురంలో పదవీకాలం ముగిసిన ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఘన సన్మానం. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, గడికోట మోహన్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 Sept 2026 4:47 PM IST
Ramapuram
X

Ramapuram: పదవీకాలం ముగిసిన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

రామాపురం: రామాపురం మండలంలో పదవీకాలం ముగించుకున్న ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఘనంగా సన్మాన సభ నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయచోటి మాజీ శాసనసభ్యులు శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, లకిడిపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ గడికోట మోహన్ రెడ్డి గారు, శ్రీ రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి గారు విచ్చేసి ప్రజా ప్రతినిధులను శాలువాలతో సత్కరించి అభినందించారు.

ప్రజలకు సేవ చేసిన ప్రతి ప్రజాప్రతినిధి సేవలనుకొనియాడుతూ, భవిష్యత్తులో కూడా ప్రజల కోసం ఇదే సేవాస్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. రామాపురం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన సభ విజయవంతంగా జరిగింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI