Rajampet: సుగవాసి ప్రసాద్ బాబును అభినందించిన మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి

Rajampet: రాజంపేట టీడీపీ అధ్యక్షుడు, గాలివీడు జడ్పీటీసీ సుగవాసి ప్రసాద్ బాబును కలసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి. రికార్డు మెజారిటీపై ప్రశంసలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 8 Nov 2026 8:34 PM IST
Rajampet
X

Rajampet: సుగవాసి ప్రసాద్ బాబును అభినందించిన మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి

రాజంపేట: ఆదివారం సాయంత్రం రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాలివీడు జడ్పీటీసీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే శ్రీ ద్వారకనాథ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గాలివీడు జడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించిన సుగవాసి ప్రసాద్ బాబు గారిని మాజీ ఎమ్మెల్యే శ్రీ ద్వారకనాథ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆశీస్సులతో, కార్యకర్తల అండదండలతో సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI