Obulavaripalle: ముక్కావారిపల్లెలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే!
Obulavaripalle: ముక్కావారిపల్లె గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి దంపతులు.
Obulavaripalle: ముక్కావారిపల్లెలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే!
Obulavaripalle: ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లె గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ గారు రైల్వే కోడూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారు, వారి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి గారు, ఓబులవారిపల్లె మండల ఎంపీపీ శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, గ్రామ స్వరాజ్య స్థాపనకు, గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి పంచాయతీ ఎన్నికలు ఎంతో కీలకమని చాటుతూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యారు.
గ్రామ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, స్థానిక పాలనా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజల చైతన్యం, బాధ్యతాయుతమైన భాగస్వామ్యమే ప్రధాన బలం.
ఓటు మన హక్కు.. ఓటు వేయడం మన బాధ్యత.. ప్రజాస్వామ్య పరిరక్షణ మనందరి కర్తవ్యం!




