Proddatur: ఎమ్మెల్యే వరదరాజులపై రాచమల్లు తీవ్ర విమర్శలు!
Proddatur: ప్రొద్దుటూరులో 2.47 లక్షల మంది ఓటు హక్కును కాలరాశారని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
Proddatur: ఎమ్మెల్యే వరదరాజులపై రాచమల్లు తీవ్ర విమర్శలు!
కడప జిల్లా: ప్రొద్దుటూరు రాజకీయం మరోసారి వేడెక్కింది. రామేశ్వరంలోని హనుమత్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రొద్దుటూరులో సుమారు 2.47 లక్షల మంది ప్రజల ఓటు హక్కును కాలరాశారని రాచమల్లు ఆరోపించారు.
గతంలో తాము ఎవరినీ బెదిరించి నామినేషన్లు చించలేదని, 9 మంది అభ్యర్థులు స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటే.. మిగిలిన 32 వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టామని గుర్తుచేశారు. 2019 ఓటమి తర్వాత టీడీపీతో సంబంధం లేదన్న వరదరాజులరెడ్డి, 2024లో అదే పార్టీ టికెట్ ఎలా తెచ్చుకున్నారని ప్రశ్నించారు.
కామనూరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాల కోసం తనతో సంప్రదించడం వరదరాజులరెడ్డి మరచిపోయారా అని నిలదీశారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డికి, తనకు మధ్య విభేదాలు పెట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. 85 ఏళ్ల వయసులోనైనా అసత్యాలు మాట్లాడటం మానాలని హితవు పలికారు.




