Proddatur: సచివాలయ ఉద్యోగులకు వైఎస్‌ఆర్‌సీపీ అండ: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి!

Proddatur: సచివాలయ ఉద్యోగులకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. జీవో 11ను రద్దు చేయాలని డిమాండ్.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 29 Sept 2026 1:01 PM IST
Proddatur
X

Proddatur: సచివాలయ ఉద్యోగులకు వైఎస్‌ఆర్‌సీపీ అండ: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి!

Proddatur: సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల ఆందోళనలకు వైఎస్‌ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని, వెంటనే వివాదాస్పద జీవో నంబర్ 11ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

గత 9 నెలలుగా పెండింగ్‌లో ఉన్న అరియర్స్‌ను వెంటనే చెల్లించాలని, ఉద్యోగులపై ఉన్న తీవ్రమైన పని ఒత్తిడిని తగ్గించాలని కోరారు. పని ఒత్తిడి కారణంగానే రాష్ట్రంలో సుమారు 400 మంది ఉద్యోగులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సచివాలయ ఉద్యోగులకు చట్టబద్ధంగా దక్కాల్సిన మెటర్నిటీ సెలవులను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే దేశంలోనే తొలిసారిగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, ఒకేసారి 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని రచమల్లు గుర్తుచేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR