Proddatur: ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం: ప్రొద్దుటూరు కమిషనర్ విశ్వనాథ్

Proddatur: వార్డు సచివాలయాల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి సంతృప్తి స్థాయిని పెంచాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 19 Sept 2026 4:07 PM IST
Proddatur
X

Proddatur: ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం: ప్రొద్దుటూరు కమిషనర్ విశ్వనాథ్

Proddatur: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారిలో సంతృప్తిని పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సిబ్బందికి సూచించారు.

శనివారం వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతు వార్డు సచివాలయాలకు వచ్చే ప్రతి ఫిర్యాదునూ తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేసి, సంబంధిత అధికారులతో సమన్వయమై వీలైనంత త్వరగా పరిష్కరించాలి.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వహించకూడదు. పరిష్కరించిన వివరాలను నమోదు చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

సేవలపై ప్రజల అభిప్రాయాలను IVRS ద్వారా సేకరిస్తున్నందున, బాధ్యతాయుతమైన సేవలతో 'పబ్లిక్ పాజిటివ్ పెర్సెప్షన్' (Public Positive Perception) పెరిగేలా పనిచేయాలి.. సచివాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా, ఓపికగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుభూతితో వినాలి. ​త్వరిత స్పందన, మర్యాదపూర్వక సేవలతో మున్సిపల్ పరిపాలనపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచాలని కమిషనర్ స్పష్టం చేశారు..

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR