Punganur: పుదీపట్లలో దుర్గాదేవిగా వైష్ణవి దేవి అమ్మవారి దర్శనం!
Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరు సమీపంలోని పుదీపట్ల శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో దసరా నవరాత్రుల వేళ అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. Tags / Keywords (English keyboar
Punganur: పుదీపట్లలో దుర్గాదేవిగా వైష్ణవి దేవి అమ్మవారి దర్శనం!
పుంగనూరు: చౌడేపల్లి మండలం పుదీపట్ల గ్రామంలో వెలసిన ప్రసిద్ధ స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో దసరా నవరాత్రుల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన ఆదివారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమనే వేకువజామున అమ్మవారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం దుర్గాదేవి రూపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఈ పూజా కార్యక్రమాలలో చౌడేపల్లి, పుంగనూరు, అనంతపురం మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులందరికీ ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ స్వయంగా తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ వేడుకల వల్ల పుదీపట్ల గ్రామం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.




