Pulivendula: హెచ్ఏఎం ద్వారా రూ.20 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
Pulivendula: పులివెందులలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. వర్చువల్గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు, పాల్గొన్న టీడీపీ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి.
Pulivendula: హెచ్ఏఎం ద్వారా రూ.20 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
పులివెందుల: రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లల్లో అభివృద్ధి పనుల్ని కుప్పం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ ప్రాజెక్టును వర్చువల్ లో ఇనగరేషన్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమంలో పులివెందులలో టిడిపి ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పాల్గొన్నారు.
అనంతరం మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల మున్సిపాలిటీకి కి 20 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయని ఈ నిధులను మున్సిపాలిటీలోని రోడ్లకు డ్రైన్ లకు వివిధ అభివృద్ధి పథకాలకు ఉపయోగిస్తామని తెలిపారు.
మరి కొన్ని నెలల్లో 40 కొట్ల రూపాయలు వస్తాయని అలాగే 15 ఫైనాన్స్ నిధులు కూడా వస్తాయన్నారు.




