Kadapa: ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల వేళ కడపలో పోలీసుల ఆంక్షలు తీవ్రతరం!

Kadapa: వైఎస్ఆర్ జిల్లా కడపలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు.

T. AMARNATH, PULIVENDULA
Published on: 23 Oct 2026 6:30 AM IST
Kadapa
X

Kadapa: ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల వేళ కడపలో పోలీసుల ఆంక్షలు తీవ్రతరం!

Kadapa: వైఎస్ఆర్ జిల్లా కడపలో కొనసాగుతున్న పోలీసుల దౌర్జన్యం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు. MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఆంక్షలు. పులివెందులలో ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం.

పులివెందుల పట్టణంలో BNSS సెక్షన్ 163 అమల్లో ఉందని నోటీసులో పేర్కొన్న పోలీసులు. పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉందని వెల్లడి. నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు గుమిగూడినా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిక.

గతంలో అక్టోబర్ 17న కూడా ఆంక్షలు ఉల్లంఘించినట్లు నోటీసులో ప్రస్తావన. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంపీపై చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పేరిట నోటీసు జారీ.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA