Kadapa: ప్రొద్దుటూరులో అల్యూమినియం, ఐరన్, గ్లాస్, స్టీల్ కార్మికుల నిరసన!
Kadapa: ప్రొద్దుటూరులో అల్యూమినియం, ఐరన్, గ్లాస్, స్టీల్ కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. రాజస్థాన్ వ్యాపారుల వల్ల స్థానిక కార్మికుల ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన.
Kadapa: ప్రొద్దుటూరులో అల్యూమినియం, ఐరన్, గ్లాస్, స్టీల్ కార్మికుల నిరసన!
Kadapa: స్థానిక అల్యూమినియం, ఐరన్, గ్లాస్, స్టీల్ కార్మికుల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేస్తూ 'ప్రొద్దుటూరు అల్యూమినియం ఐరన్ గ్లాస్ స్టీల్ కార్మికుల అసోసియేషన్' ఆధ్వర్యంలో గురువారం మైదుకూరు రోడ్డులోని రాజస్థాన్ దుకాణాల ఎదుట నిరసన తెలిపారు. "గో బ్యాక్ రాజస్థాన్ ఓనర్స్" అంటూ నినాదాలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు వారి రాష్ట్రాలకు సంబందించిన కార్మికులతోనే పనులు చేయిస్తుండటం వల్ల స్థానిక కార్మికులు పనులు లేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
రాజస్థాన్ దుకాణ యజమానులు ఇంటీరియర్ పరికరాల అమ్మకాల్లో నాణ్యత తగ్గించి వినియోగదారులను మోసం చేస్తున్నారని, సమస్యలు వస్తే బాధ్యత వహించడం లేదని ఆరోపించారు. స్థానిక వ్యాపారులు, వినియోగదారులు ఇతర రాష్ట్రాల వారిని కాకుండా స్థానిక కార్మికులకే పనులు అప్పగించాలని కోరారు.. రాజస్థాన్ యజమానులు చేసే మోసాలను స్థానిక యజమానులు గుర్తించాలని కోరారు..
స్థానిక కార్మికులకు పనులు కల్పించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు దస్తగిరి, ప్రధాన కార్యదర్శి వలి, సభ్యులు సుబ్బరాయుడు, హరి, షామీర్, హుస్సేన్, విజయ్ తనుష్, మస్తాన్, గౌస్, రసూల్, మాబు, అల్తాఫ్, సరసద్, తదితర కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




