Proddatur: ప్రొద్దుటూరులో వైభవంగా వరసిద్ధి వినాయక నిమజ్జనం!
Proddatur: ప్రొద్దుటూరులో ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనం: పోటాపోటీగా లడ్డూ, వెండి బిళ్ల, వెండి విగ్రహం వేలంపాటలు. కామునూరు ఏరులో శాస్త్రోక్తంగా నిమజ్జనోత్సవం.
Proddatur: ప్రొద్దుటూరులో వైభవంగా వరసిద్ధి వినాయక నిమజ్జనం!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని శ్రీరామ అపార్ట్‌మెంట్ వద్ద 7వ వార్షికోత్సవ వరసిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు.
అనంతరం బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ట్రాక్టర్‌లో అలంకరించి చెక్కభజనలు, డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్లు మరియు రంగుల హోలీ మధ్య మునిసిపల్ పార్కు పురవీధుల్లో శోభా యాత్రగా ఊరేగించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి ప్రసాదాలు, విగ్రహాల వేలంపాటలో భక్తులు పోటాపోటీగా పాల్గొన్నారు.
వెండి బిళ్ళ దాత పి. సురేంద్ర స్వామివారికి సమర్పించిన వాటిని అత్యధికంగా పాటలో దక్కించుకున్న కె. సురేష్ వెండి బిళ్ళ 70,000రు, పాలెం శ్రీనివాసులు వెండి విగ్రహం 65,000రు, నోట్ల దండ మురళి 40,900రు, వినాయకుని లడ్డూషేక్ శామీర్ 30,888రు, కలశం చెంబు రాజా 15,000రు, అనంతరం వినాయకుని విగ్రహాన్ని కామునూరు ఏరులో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని కమిటీ ప్రతినిధులు గౌస్, నాగేష్, మురళి, సురేంద్ర తదితరులు కోరుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




