Proddatur: ప్రొద్దుటూరులో వరసిద్ధి వినాయక ఏడవ వార్షికోత్సవం!
Proddatur: ప్రొద్దుటూరులో శ్రీరామ అపార్ట్‌మెంట్ వద్ద వరసిద్ధి వినాయకుని ఏడవ వార్షికోత్సవం. ప్రత్యేక పూజల్లో పాల్గొని కోలాటం ఆడి అలరించిన ఏఎస్పీ విభూ కృష్ణ.
Proddatur: ప్రొద్దుటూరులో వరసిద్ధి వినాయక ఏడవ వార్షికోత్సవం!
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ పార్క్ ప్రాంతంలో శ్రీరామ అపార్ట్‌మెంట్ వద్ద ఏడవ వార్షికోత్సవ వరసిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు సమర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని, విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ కలగాలని ఆకాంక్షించారు. మండపం వద్ద భక్తులు ఉత్సాహంగా నిర్వహించిన కోలాటంలో ఏఎస్పీ స్వయంగా పాల్గొని కోలాటం కార్యక్రమన్ని అలరించారు. అధికారులు, ప్రజలతో కలిసి వేడుకల్లో పాలుపంచుకోవడంపై స్థానికులు, అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, గౌస్, నగేష్, సురేంద్ర, మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




