Kadapa: ప్రొద్దుటూరు మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం!
Kadapa: ప్రొద్దుటూరు మండలం అమృత నగర్ 5వ వార్డు ఎంపీటీసీగా చిలకల ప్రభావతి ఏకగ్రీవమయ్యారు. సహకరించిన టీడీపీ నేత రాజేశ్వర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Kadapa: ప్రొద్దుటూరు మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం!
Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రొద్దుటూరు మండలం మొత్తం 24 ఎంపీటీసీ లు గాను 23 ఎంపీటీసీలు ఏకగ్రీవాలు. ఇందులో భాగంగా కొత్తపల్లె పంచాయతీ అమృత నగర్ ఎంపీటీసీ 5 వార్డ్ చిలకల ప్రభావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి ఆమె తన ఎన్నికల డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు.
నేడు సినీ హబ్ లోని కార్యాలయంలో టిడిపి నాయకులు బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ని ప్రభావతి తన స్నేహితురాలు రాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ప్రభావతి బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ని సత్కరించి, తన ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు...




