Proddatur: టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డికి వైఎస్ జబీవుల్లా కృతజ్ఞతలు!

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 19, 20, 25 వార్డుల్లో ఏకగ్రీవమైన కౌన్సిలర్లు, వైఎస్ జబీవుల్లా కుటుంబ సభ్యులు టీడీపీ నేత బద్వేలు శ్రీనివాసులరెడ్డిని సత్కరించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 28 Oct 2026 10:36 PM IST
Proddatur
X

Proddatur: టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డికి వైఎస్ జబీవుల్లా కృతజ్ఞతలు!

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 19, 20, 25 వార్డులకు కౌన్సిలర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ హరీఫ్ హుస్సేన్, వైఎస్ ముజాహిద్దీన్, వైఎస్ డౌలతున్ టీడీపీ జిల్లా కార్యదర్శి వైఎస్ జబీవుల్లా ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసులరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

​ఈ సందర్భంగా వైఎస్ జబీవుల్లా, వైఎస్ ముజాయిద్దీన్, వైఎస్ హరీఫ్ హుస్సేన్, వైఎస్ మహమ్మద్ గౌస్‌ వీరు శ్రీనివాసులరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. తమ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినందుకు గానూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR