Proddatur: ప్రొద్దుటూరు టిడిపి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్: ముక్తియర్
Proddatur: ప్రొద్దుటూరు టిడిపి బహిరంగ సభ విజయవంతంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన అసత్య వ్యాఖ్యలను టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ ముక్తియర్ తిప్పికొట్టారు.
Proddatur: ప్రొద్దుటూరు టిడిపి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్: ముక్తియర్
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ విజయవంతం కావడంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ ముక్తియర్.. రాచమల్లు కూతురు పెళ్లికి వచ్చినంత మంది కూడా టిడిపి బహిరంగ సభకు రాలేదు అని చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ, సొంత పెద్ద కూతురే పెళ్లికి రాలేదనే ప్రజలు గ్రామాలలో చర్చించుకుంటున్నారన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి నిజమైన అభివృద్ధి పనులు జరగలేదని, ఉనికి కోసమే అసత్య ప్రచారాలు మరియు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అనవసరపు మాటలు, మాట్లాడటం మానుకొని, ప్రొద్దుటూరు అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలి ముక్తియర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొండయ్య, మాజీ జెడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ అంజి, తెలుగుదేశం నాయకుడు హరినాథ్ రెడ్డి, మైనార్టీ నాయకుడు మున్నా, తదితరులు పాల్గొన్నారు.




