Proddatur: ప్రొద్దుటూరును ఫ్యాక్షన్ పట్టణంగా మార్చొద్దు

Proddatur: ప్రొద్దుటూరును ఫ్యాక్షన్ పట్టణంగా మార్చొద్దని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి టీడీపీ షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ వి.ఎస్. ముక్తియార్ హెచ్చరిక.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 21 Oct 2026 10:02 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరును ఫ్యాక్షన్ పట్టణంగా మార్చొద్దు

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముక్తియార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రొద్దుటూరును మళ్లీ ఫ్యాక్షన్ పట్టణంగా మార్చే ప్రయత్నాలు చేయవద్దని రాచమల్లును తీవ్రంగా హెచ్చరించారు.

​వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తుచేస్తూ ముక్తియార్ విమర్శల వర్షం కురిపించారు. 2021 ఎన్నికల్లో 32 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించి, మిగిలిన చోట్ల బలవంతపు ఏకగ్రీవాలు చేయలేదా అని ప్రశ్నించారు. గతంలో తనను అరెస్టు చేయించి పోలీసుల బందోబస్తు మధ్య ఎన్నికలు జరిపించిన విషయాన్ని రాచమల్లు మర్చిపోయారా అని నిలదీశారు.

​గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, నాటి అధికారులు నేటికీ కోర్టులు, దర్యాప్తు సంస్థల చుట్టూ తిరుగుతున్నారని గుర్తుచేశారు.

ఇతరులపై ఆరోపణలు చేసే ముందు రాచమల్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ​ఎన్నికల అధికారులు, కలెక్టర్‌పై రాచమల్లు చేసిన అనుచిత వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు ముక్తియార్ తెలిపారు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, అనవసర వ్యాఖ్యలతో ప్రజల్లో ఉద్రిక్తతలు పెంచవద్దని స్పష్టం చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR