Proddatur: ప్రొద్దుటూరులో తాజా విందు నాన్ వెజ్ హోటల్ ప్రారంభం
Proddatur: ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డులో ‘తాజా విందు’ నాన్ వెజ్ హోటల్‌ను ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రారంభించారు. ఇక్కడ నాన్ వెజ్‌తో పాటు రాగి ముద్ద లభించనుంది.
Proddatur: ప్రొద్దుటూరులో తాజా విందు నాన్ వెజ్ హోటల్ ప్రారంభం
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఓల్డ్ వస్త్ర భారతి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన తాజా విందు నాన్ వెజ్ హోటల్‌ను ఆదివారం ప్రారంభించారు. ప్రకాష్ అగ్రో ఫౌండర్ విజయ భాస్కర్ రెడ్డి, గురుభాస్కర్ రెడ్డి, దస్తగిరి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై హోటల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకుడు చిలకల రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో తాజా విందు హోటల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇప్పటికే తాజా కిచెన్‌లో పూర్తిగా శాఖాహార వంటకాలను అందిస్తున్నామని, తాజా విందు హోటల్‌లో మాత్రం శాఖాహారంతో పాటు మాంసాహార వంటకాలు, ప్రత్యేకంగా రాగి ముద్ద కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు.
పట్టణ ప్రజలకు రుచికరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా హోటల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మైదుకూరు రోడ్డులో సులభంగా చేరుకునే ప్రాంతంలో హోటల్‌ను ఏర్పాటు చేసినందున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.




