Proddatur: ప్రొద్దుటూరులో స్థానిక కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉపాధి కల్పించి, స్థానిక కార్మికులను ఆదుకోవాలని కోరుతూ స్టీల్, ఐరన్, గ్లాస్ యూనియన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 23 Sept 2026 1:19 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో స్థానిక కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం!

Proddatur: ​ప్రొద్దుటూరులో దాదాపు 10 వేల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ​ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు, పెద్ద కాంట్రాక్టర్లు తక్కువ రేట్లకు పనులు చేస్తూ స్థానిక పనులన్నీ దక్కించుకుంటున్నారు అంటూ ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇచ్చి ఆవేదన చెందారు.. ​సరిపడా పనులు లేకపోవడం వల్ల షాపులు రూముల అద్దెలు, కరెంట్ బిల్లాలు, పనివారి జీతాలు కూడా చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.

​వేరే పనులు చేసే నైపుణ్యం లేకపోవడంతో, అప్పులు తీర్చలేక భవిష్యత్తులో ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ నిర్మాణ పనుల్లో స్థానిక వృత్తిదారులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతర రాష్ట్రాల నుండి లైసెన్స్ లేకుండా వచ్చి పనిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలి.

చిన్న వృత్తిదారులకు తక్కువ వడ్డీకే రుణాలు, సబ్సిడీలు అందించాలి. అదేవిధంగా వర్కర్ల కోసం తక్కువ అద్దెతో ఒక ప్రత్యేక 'ట్రేడ్ కాంప్లెక్స్' లేదా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలి వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు.. ఈ కార్యక్రమంలో దస్తగిరి, వల్లి, మొహమ్మద్ రఫీ, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR