Proddatur: కుక్క మొరిగిందని గొర్రెల కాపరిపై కొడవలితో దాడి
Proddatur: కుక్క మొరిగిందన్న స్వల్ప వివాదంతో చౌడూరు పెన్నా తీరంలో గొర్రెల కాపరి రాజశేఖర్‌పై సుబ్బారెడ్డి, కిరణ్ కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
Proddatur: కుక్క మొరిగిందని గొర్రెల కాపరిపై కొడవలితో దాడి
కడప జిల్లా: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్వల్ప వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. గొర్రెలు, పశువులపై కుక్క మొరిగిందన్న చిన్న కారణంతో ఓ గొర్రెల కాపరిపై కొడవలితో దాడి చేసిన సంఘటన చౌడూరు గ్రామంలో కలకలం లేపింది.
పెన్నా నది తీరంలో సుబ్బారెడ్డి అనే వ్యక్తి కూడా తన పశువులను మేపుకుంటున్న సమయంలో, అతని వెంట ఉన్న కుక్క అక్కడే గొర్రెలను, పశువులను మేపుతున్న రాజశేఖర్ అనే కాపరి వైపు అరుస్తూ వెళ్ళింది.
తన గొర్రెలపైకి వస్తున్న కుక్కను రాజశేఖర్ మందలించాడు. దీన్ని తట్టుకోలేకపోయిన సుబ్బారెడ్డి, "నా కుక్కనే మందలిస్తావా?" అంటూ ఆగ్రహంతో సుబ్బారెడ్డి తనతో ఉన్న కిరణ్ రెడ్డి అనే మరో వ్యక్తితో కలిసి రాజశేఖర్‌పై కొడవలితో దాడికి తెగబడ్డాడు.
ఈ దాడిలో రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రాజశేఖర్‌ను వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.




