Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎస్సీలకు అవకాశం దక్కేనా?
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎస్సీ వర్గానికి వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని డిమాండ్. రేసులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనుచరుడు తలారి పుల్లయ్య.
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎస్సీలకు అవకాశం దక్కేనా?
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఏర్పడిన నాటి నుండి ఎస్సీలకు చైర్మన్ గా కానీ వైస్ చైర్మన్ గా కానీ అవకాశం దక్కలేదు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లుగా ఎస్సీలకు ఎంతో మందికి అవకాశం దక్కినా వైస్ చైర్మన్ గా నియమించడంలో రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వలేదని చెప్పవచ్చు కనీసం 2026 మున్సిపల్ ఎన్నికల అనంతరం ఏర్పడబోయే పాలకమండలిలో వైస్ చైర్మన్ గా రెండుసార్లు కౌన్సిలర్ గా పనిచేసిన తలారి పుల్లయ్యకు అవకాశం.
దక్కనుందా అని చర్చ జరుగుతోంది తలారి పుల్లయ్య మొదటి నుండి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి నాయకత్వం లో పనిచేస్తూ ఆయన రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుండి వరదవర్గంలోనే కొనసాగుతూ నాయకుడి నమ్మకాన్ని పొందారనడంలో సందేహం లేదు.
అందుకే మున్సిపల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైస్ చైర్మన్గా ఎస్సీలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశం తెలుగుదేశం పార్టీ నాయకులలో ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఎస్సీలకు వైస్ చైర్మన్ గా కేటాయిస్తే ఖచ్చితంగా తలారి పుల్లయ్య కు అవకాశం దక్కవొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు పట్టణంలోని ఎస్సీ వర్గాలు కూడా ఒక్కసారైనా వైస్ చైర్మన్ గా ఎస్సీలకు కేటాయించాలని కోరుతుండడం విశేషం..




