Proddatur: నవంబర్ 2న సదరం స్లాట్స్ ప్రారంభం – కమిషనర్ విశ్వనాథ్!

Proddatur: నవంబర్ 2న సదరం స్లాట్ ప్రారంభం కానుందని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ వెల్లడి. దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 27 Oct 2026 8:56 PM IST
Proddatur
X

Proddatur: నవంబర్ 2న సదరం స్లాట్స్ ప్రారంభం – కమిషనర్ విశ్వనాథ్!

ప్రొద్దుటూరు: ​దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందించేందుకు నవంబర్ 2వ తేదీన సదరం స్లాట్ ప్రారంభం కానుందని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. పురపాలక పరిధిలోని అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

​ఈ సందర్భంగా కమిషనర్ జిన్నా రోడ్ సచివాలయ సందర్శనలో భాగంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. సచివాలయాల పరిధిలో సదరం సర్టిఫికెట్లు లేని అర్హులైన దివ్యాంగులను వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీలు వెంటనే గుర్తించాలి.

దివ్యాంగులకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, స్లాట్ నమోదు మరియు సర్టిఫికెట్లు పొందే ప్రక్రియలో సచివాలయ సిబ్బంది పూర్తి సహకారం అందించాలి.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు అర్హులైన దివ్యాంగులందరికీ అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ పరబ్రహ్మం మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR