Proddatur: ప్రొద్దుటూరులో పేకాట శిబిరంపై దాడి ఆరుగురి అరెస్ట్!
Proddatur: ప్రొద్దుటూరు సాయిబాబా గుడి వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడి. ఆరుగురు అరెస్ట్, రూ.22,870 నగదు, పేకముక్కలు స్వాధీనం.
Proddatur: ప్రొద్దుటూరులో పేకాట శిబిరంపై దాడి ఆరుగురి అరెస్ట్!
Proddatur: ప్రొద్దుటూరు ఏఎస్పి విభూ కృష్ణ ఆదేశాల మేరకు, వన్ టౌన్ సీఐ టి.వి కొండారెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మరియు సిబ్బంది శుక్రవారం సాయంత్రం రామేశ్వరం రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో పేకాట శిబిరం పై దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టయిన నిందితులు రమేష్ (39) షేక్ మజీద్ భాష(30) మోపురి రవీంద్రారెడ్డి (36) సాలంకు ఉపేంద్ర (26) సుంకేసుల గురు ప్రతాప్ (30) దూదేకుల మదార్ వల్లి (35) నిందితులందరూ ప్రొద్దుటూరు పట్టణ నివాసితులేనని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 22 వేల870 రు నగదు మరియు 52 పేకముక్కలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు వెల్లడించారు.




