Proddatur: ప్రొద్దుటూరులో విద్యుత్ వైర్లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్లు దొంగిలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ విభుకృష్ణ తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 23 Sept 2026 2:37 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో విద్యుత్ వైర్లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్!

Proddatur: ప్రొద్దుటూరులో విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్లను దొంగిలిస్తున్న ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అడిషనల్ ఎస్పీ విభుకృష్ణ వెల్లడించారు. ​56 కేజీల సిల్వర్ సర్వీస్ వైర్, ​5 కేజీల కాపర్ (రాగి) వైర్, ​రూ.5,40,000 నగదు ​ఒక ఆటో, 2 బైక్‌లు మరియు ఐరన్ రాడ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఈ దొంగతనాలకు పాల్పడిన వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, మహేష్, కిరణ్, రంగనాయకులు అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు లేదా దానికి సంబంధించిన సామాగ్రి కనిపించకుండా పోయినా, అనుమానాస్పదంగా ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అడిషనల్ ఎస్పీ విభుకృష్ణ ప్రజలను కోరారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR