Proddatur: ప్రొద్దుటూరులో ఎన్నికల అధికారులపై నిరాధార ఆరోపణల ఖండన!

Proddatur: ప్రొద్దుటూరులో ఎన్నికల అధికారులపై నిరాధార ఆరోపణలను ఖండించిన మున్సిపల్ అధికారులు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ. విచారణ కోరిన కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 26 Oct 2026 7:11 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో ఎన్నికల అధికారులపై నిరాధార ఆరోపణల ఖండన!

​Proddatur: ప్రొద్దుటూరు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులపై ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. రాజకీయ విమర్శల కోసం ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకోవద్దని కోరారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఉపసంహరణ వరకు ఎన్నికల ప్రక్రియను ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా, అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు. నిరాధార వ్యాఖ్యలు విధుల్లో ఉన్న అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, ఏవైనా అనుమానాలు ఉంటే ఆధారాలతో అధికారికంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ​మున్సిపల్ కమిషనర్ అసిస్టెంట్ ఎన్నికల అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ ​"డబ్బులు తీసుకున్నానంటూ నాపై చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం. ఎన్నికల నిబంధనలకు కట్టుబడి విధులు నిర్వహిస్తున్నాం. నాపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది." ​ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని వర్గాలు సహకరించాలని ఎన్నికల అధికారులు వి. హరి ప్రసాద్, ఎస్. సఫీ ఉల్లా బాషా, వి. భాస్కర్, బి.పి. సంతోష్ కుమార్, పి. లక్ష్మీనరసింహులు తదితరులు సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR