Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 156 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు!
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 1,37,202 మంది ఓటర్ల కోసం 156 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమీషనర్ విశ్వనాధ్ వెల్లడి పూర్తి వివరాలు
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 156 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు!
Proddatur: ప్రొద్దుటూరు పట్టణంలో ఎన్నికల ప్రక్రియ సంబంధిత ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాల ప్రాథమిక జాబితాను అధికారికంగా విడుదల చేసిన మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ... పట్టణ వ్యాప్తంగా మొత్తం 1,37,202 మంది ఓటర్లు ఉన్నారని, వారి సౌకర్యార్థం 156 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి పోలింగ్ కేంద్రానికి సగటున 880 మంది ఓటర్లను కేటాయించినట్లు కమీషనర్ వివరించారు. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల పరిశీలన కోసం
ఈ జాబితాను మున్సిపల్ కార్యాలయంతో పాటు ఇతర ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ACP) టి. కృష్ణా సింగ్ ఠాగూర్, సీనియర్ అసిస్టెంట్ జి. మహేష్ బాబు మరియు ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.




