Proddatur: ప్రొద్దుటూరు టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి!
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి భారీ ర్యాలీతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు.
Proddatur: ప్రొద్దుటూరు టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి మున్సిపాల్ చైర్మన్ గా పోటీ చేస్తున్నాడు..పార్టీ శ్రేణులు, మద్దతుదారుల అపూర్వ జనసందోహం మధ్య ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
నామినేషన్ ప్రక్రియకు ముందు నంద్యాల రాఘవరెడ్డి పట్టణంలో ఆధ్యాత్మిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక అమ్మవారిశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం స్థానిక దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి స్వయంగా పాల్గొని రాఘవరెడ్డికి పూర్తి మద్దతు తెలిపారు. రాఘవరెడ్డితో పాటు పలువురు నాయకులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చైర్మన్ అభ్యర్థి కుమారుడు నంద్యాల రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్ పాల్గొన్నారు.




