Proddatur: ప్రొద్దుటూరు 42వ వార్డు వైసీపీ అభ్యర్థిగా బంగారు మునిరెడ్డి

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 42వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పాతకోట బంగారు మునిరెడ్డి అధికారికంగా నామినేషన్‌ దాఖలు చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 17 Oct 2026 6:49 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు 42వ వార్డు వైసీపీ అభ్యర్థిగా బంగారు మునిరెడ్డి

ప్రొద్దుటూరు: ​ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ముఖ్యమైన 42వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రముఖ నాయకులు, పాతకోట బంగారు మునిరెడ్డి అధికారికంగా తమ నామినేషన్‌ను దాఖలు చేశారు. ​

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వార్డు ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, స్థానిక సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తూ ప్రొద్దుటూరు 42వ వార్డును అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR