Proddatur: ప్రొద్దుటూరులో కూటమి క్లీన్ స్వీప్: వినీత ఏకగ్రీవ విజయం!

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్ సాధించింది. 8వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌గా గాండ్ల వినీత ఏకగ్రీవంగా ఎన్నికై అధికారుల నుంచి డిక్లరేషన్ అందుకున్నారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 25 Oct 2026 10:03 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో కూటమి క్లీన్ స్వీప్: వినీత ఏకగ్రీవ విజయం!

ప్రొద్దుటూరు: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (కూటమి) సంచలన విజయం సాధించింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 52 మున్సిపల్ వార్డులలో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికై, కూటమి క్లీన్ స్వీప్ నమోదు చేసింది. ​

ఇందులో భాగంగా 8 వ వార్డు కౌన్సిలర్‌గా గాండ్ల వినీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి ఆమె తన ఎన్నికల డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. ​ ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మునిసిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఆయన అధికారిక డిక్లరేషన్ స్వీకరించారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR