Proddatur: ప్రొద్దుటూరులో బాబాయి, అమ్మాయి ఏకగ్రీవ విజయం!
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 14, 15 వార్డుల నుంచి బాబాయి, అమ్మాయి అసం సురేష్ కుమార్ రెడ్డి, ఆసం ప్రత్యూష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Proddatur: ప్రొద్దుటూరులో బాబాయి, అమ్మాయి ఏకగ్రీవ విజయం!
ప్రొద్దుటూరు: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (కూటమి) సంచలన విజయం సాధించింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 52 మున్సిపల్ వార్డులలో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికై, కూటమి క్లీన్ స్వీప్ నమోదు చేసింది.
ఇందులో భాగంగా 14వ వార్డు కౌన్సిలర్‌గా అసం సురేష్ కుమార్ రెడ్డి అదేవిధంగా 15 వా వార్డు టిడిపి కౌన్సిలర్ గా ఆసం ప్రత్యూష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి వారికీ ఎన్నికల డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మునిసిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఆయన అధికారిక డిక్లరేషన్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు.




