Proddatur: వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి ప్రొద్దుటూరు కమిషనర్ విశ్వనాథ్
Proddatur: కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలతో ప్రొద్దుటూరులో వర్షాలపై మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం. కంట్రోల్ రూమ్, ర్యాపిడ్ యాక్షన్ టీమ్ సిద్ధం: కమిషనర్ విశ్వనాథ్.
Proddatur: వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి ప్రొద్దుటూరు కమిషనర్ విశ్వనాథ్
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో రానున్న వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు మున్సిపల్ యంత్రాంగం పటిష్ట ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.
మున్సిపల్ శానిటేషన్, ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తూ పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ ప్రవాహంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం శానిటరీ ఇన్‌స్పెక్టర్, సెక్రటరీ, 10 మంది కార్మికులతో ప్రత్యేక రాపిడ్ యాక్షన్ టీమ్‌ను అందుబాటులోకి తెచ్చారు.
మోర్ సూపర్ మార్కెట్, జంగంపేట, రాజీవ్ సర్కిల్ వంటి నీరు నిలిచే ప్రాంతాల్లో నీటిని వెంటనే తొలగించేందుకు మోటార్లను సిద్ధం చేశారు. డ్రైనేజీలు, కాలువల్లో పూడిక తీత పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజల ఫిర్యాదుల కోసం మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
త్రాగునీరు, వీధి దీపాల సమస్యలకు:
AE కె. సురేంద్ర నాథ్ రెడ్డి – 77995 72160
పారిశుధ్య సమస్యల కోసం:
MHO డా. ఎస్. రమేష్ – 📞 90142 65600
ఆరోగ్య జాగ్రత్తలు & విజ్ఞప్తి:
వర్షాకాలంలో కాచి వడబోసిన నీటినే తాగాలని, నిల్వ ఆహారం తీసుకోవద్దని కమిషనర్ సూచించారు. జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




