Proddatur: మెరుగైన పారిశుధ్య సేవలందించడమే లక్ష్యం కమిషనర్!

Proddatur: ప్రొద్దుటూరులో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సమీక్ష. నవంబర్ 1 నుంచి సిబ్బందికి ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం అమలు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 26 Oct 2026 7:12 PM IST
Proddatur
X

Proddatur: మెరుగైన పారిశుధ్య సేవలందించడమే లక్ష్యం కమిషనర్!

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచి, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నారని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. పారిశుధ్య అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు జారీ చేశారు.

నవంబర్ 1వ తేదీ నుంచి పారిశుధ్య సిబ్బందికి ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రతి శనివారం శానిటేషన్ సెక్రటరీలు ఇళ్లు, టీ దుకాణాలు, హోటళ్లను సందర్శించి ప్లాస్టిక్ వినియోగం తగ్గించడంపై అవగాహన కల్పించి నివేదికలు సమర్పించాలి.

ప్రతి నెల మూడవ శనివారం వార్డు సభ్యులు, ప్రజల భాగస్వామ్యంతో 'స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ ప్రొద్దుటూరు' కార్యక్రమాన్ని నిర్వహించాలి. దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు అబేట్ ద్రావణం పిచికారీతో పాటు, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ ఉపయోగించాలి.

వార్తాపత్రికల్లో వచ్చే పారిశుధ్య ప్రతికూల వార్తలపై శానిటేషన్ సెక్రటరీలు వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించాలి. పారిశుధ్య సేవలపై ప్రజల నుంచి నిరంతరం ఫీడ్‌బ్యాక్ సేకరిస్తూ, 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రజల సంతృప్తిని పెంపొందించేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

​ఈ సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. రమేష్, శానిటరీ సూపర్వైజర్ ఎస్. నూర్ భాషా, ఎన్విరాన్మెంటల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్. దస్తగిరి, శానిటరీ ఇన్స్పెక్టర్లు పి. రామచంద్రుడు, సి. రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR