Proddatur: మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డికి ఘన సత్కారం
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన నంద్యాల రాఘవరెడ్డిని ఆయన స్వగ్రామం కామునూరులో అమృత నగర్ టీడీపీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి.
Proddatur: మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డికి ఘన సత్కారం
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన నంద్యాల రాఘవరెడ్డికి పెద్ద సంఖ్యలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్తపల్లి పంచాయతీ అమృత నగర్ 5వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రాఘవరెడ్డి అభిమానులు ఆయన పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో ఆయన స్వగ్రామమైన కామునూరుకు వెళ్లిన అమృత నగర్ 5వ వార్డు అభిమానులు, మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డిని పూలమాలలు వేసి, ఘనంగా శాలువా కప్పి నూతన బాధ్యతలు చేపడుతున్నందుకు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ, ఆయన మున్సిపల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ మరియు పార్టీ శ్రేణులకు ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. రాఘవరెడ్డి నాయకత్వంలో ప్రొద్దుటూరు పట్టణం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు...




