Proddatur: అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి!
Proddatur: ప్రొద్దుటూరు అభివృద్ధిలో భాగంగా రూ.7 కోట్లతో గాంధీ రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రారంభించారు.
Proddatur: అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి!
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వెల్లడించారు. నేడు 7 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గాంధీ రోడ్డు విస్తరణ పనులను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి మొత్తం రూ. 40 కోట్లు మంజూరయ్యాయని, పట్టణంలో అత్యవసరమైన అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్నామని తెలిపారు.
వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే దాదాపు రూ.100 కోట్ల రూపాయలు స్వాహా చేశారని మండిపడ్డారు. అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు ఇష్టారాజ్యంగా బిల్లులు చేసుకుని ప్రజాధనాన్ని తిన్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మాణంలోనే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రూ. 20 కోట్లు అవినీతికి పాల్పడ్డారని, ఈ 100 కోట్ల నిధులపై కచ్చితంగా లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు.
బీసీ వర్గానికి చెందిన మహిళను చైర్‌పర్సన్‌గా చేసినప్పటికీ, అధికారాన్ని మొత్తం మాజీ ఎమ్మెల్యే తన చేతుల్లోనే ఉంచుకుని చక్రం తిప్పారని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే ప్రధాన అంశాలుగా ప్రజల ముందుకు తీసుకెళ్లి ఓట్లు అడుగుతామని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.




