Proddatur: రాపిడో సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి
Proddatur: ప్రొద్దుటూరులో రాపిడో బైక్, ఆటో సేవలను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రారంభించారు. రైడర్లకు హెల్మెట్లు పంపిణీ చేసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
Proddatur: రాపిడో సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో రాపిడో బైక్, ఆటో సేవలను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గురువారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అధికారికంగా ప్రారంభించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ప్రజలకు చవకైన, సులభమైన రవాణా సౌకర్యం అందించడమే ఈ సేవల ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు.
రాపిడోలో పనిచేసే రైడర్లకు (కెప్టెన్లు) సంస్థ రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడాన్ని ఆయన అభినందించారు. బైక్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్, భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు.
ఈ కార్యక్రమం రాపిడో కెప్టెన్లకు ఎమ్మెల్యే హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం రాపిడో సిబ్బంది, రైడర్లతో కలిసి పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ప్రారంభించారు. స్థానిక ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.




