Proddatur: జల్ జీవన్ మిషన్ ప్రారంభం: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కృతజ్ఞతలు

Proddatur: ప్రొద్దుటూరులో ‘జల్ జీవన్ మిషన్’ పథకం ప్రారంభించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 6 Oct 2026 3:23 PM IST
Proddatur
X

Proddatur: జల్ జీవన్ మిషన్ ప్రారంభం: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కృతజ్ఞతలు

ప్రొద్దుటూరు: స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు కలిసికట్టుగా పనిచేసి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఈ సభను విజయవంతం చేశారని పేర్కొన్నారు. దాదాపు 70,000 మంది ప్రజలు ఈ సభకు తరలిరావడంతో భారీగా జనం, ట్రాఫిక్ ఏర్పడ్డాయి. ​తాగునీటి ప్రాజెక్టులు మరియు స్థానిక రోడ్ల కోసం నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరగా, ఆయన అందుకు సానుకూలంగా స్పందించి నిధులు ఇచ్చేందుకు అంగీకరించారు.

​సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా స్థానిక కూరగాయల మార్కెట్ పనులు, కొర్రపాడు-మైదుకూరు రోడ్డు విస్తరణ, మైదుకూరు బైపాస్/రింగ్ రోడ్డు, పలు నిలిచిపోయిన అభివృద్ధి పనులను తీసుకెళ్లారు అలాగే 65–70 ఏళ్ల నాటి పాలిటెక్నిక్ కాలేజీ భవన పునరుద్ధరణ, నిలిచిపోయిన ఇంజనీరింగ్ కాలేజీ పనుల కోసం విజ్ఞప్తులను సమర్పించారు.

ప్రొద్దుటూరు చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా నిర్వహించిన కార్యక్రమం అత్యంత విజయవంతమైందని తెలిపి, దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ​ప్రొద్దుటూరుతో పాటు జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైదుకూరు వంటి ఇతర పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రొద్దుటూరు ప్రజలు తమ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయం చేకూర్చడానికి ముందుకు వస్తున్నారని కొనియాడారు. ​ప్రజలు తనపై చూపించిన ప్రేమ, ఆదరణ ఎప్పటికీ రుణపడి ఉంటానని, భవిష్యత్తులో నిరంతరం ప్రజల సంక్షేమం మరియు ప్రాంత అభివృద్ధి కోసం శ్రమిస్తానని స్పష్టం చేశారు. ​పవన్ కళ్యాణ్ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడి, ప్రొద్దుటూరు అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతి పత్రాలు త్వరలోనే విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ​

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తూ అభివృద్ధి నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ​కార్యక్రమానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు పర్యవేక్షించి సహకరించిన జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ (SP), RDO, తహసీల్దార్, మరియు స్థానిక పోలీసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి ఎస్ ముక్తయర్, మాజీ జెడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్లు కొండయ్య, అంజి, ఘంటసాల, మైనార్టీ నాయకుడు మున్నా, టిడిపి యువ నాయకుడు హరినాథ్ రెడ్డి తదితలులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR