Proddatur: అమృత నగర్‌లో చెత్త డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం

Proddatur: ప్రొద్దుటూరు అమృత నగర్‌లో చెత్త డంపింగ్ నిలిపివేయాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశించడంతో స్థానికులు తమ నిరసన దీక్షను విరమించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 6 Oct 2026 9:35 PM IST
Proddatur
X

Proddatur: అమృత నగర్‌లో చెత్త డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం

Proddatur: అమృత నగర్‌లో చెత్తను నిలువ చేయవద్దంటూ స్థానిక ప్రజలు చేపట్టిన దీక్షకు పరిష్కారం లభించింది. ప్రజల నిరసనపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తక్షణమే స్పందించారు. ఇకపై ఆ ప్రాంతంలో చెత్తను వేయవద్దని సంబంధిత అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ​

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎంపీడీఓ మరియు కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. అమృత నగర్ సమీపంలో ఎలాంటి చెత్తను నిలువ చేయబోమని ఎమ్మెల్యే తరఫున అధికారుల బృందం ప్రజలకు హామీ ఇచ్చారు. ​

అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించడంతో అమృత నగర్ వాసులు తమ దీక్షను విరమించారు. ఈ సందర్భంగా సమస్యను త్వరితగతిన పరిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి, సహకరించిన అధికారులకు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR