Proddatur: గాంధీ జయంతి సందర్భంగా మాంసం, మద్యం దుకాణాలు బంద్

Proddatur: గాంధీ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరులో అక్టోబర్ 2న మాంసం, వైన్ షాపులు పూర్తిగా మూసివేయాలని మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 1 Oct 2026 10:03 PM IST
Proddatur
X

Proddatur: గాంధీ జయంతి సందర్భంగా మాంసం, మద్యం దుకాణాలు బంద్

​ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో మాంసం, మద్యం దుకాణాలు పూర్తిస్థాయిలో మూసివేయాలని మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పశువధ శాలలతో పాటు గొర్రెలు, మేకల మాంసం విక్రయించే దుకాణాలు, అన్ని రకాల వైన్ షాపులను అక్టోబర్ 2న తెరవకూడదని స్పష్టం చేశారు.

ఈ నిర్ణయానికి వైన్ షాపులు, మాంసం దుకాణాల యజమానులు, వ్యాపారులు పూర్తిగా సహకరించాలని కమీషనర్ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR