Proddatur: ప్రొద్దుటూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి లైంగిక వేధింపుల కలకలం!

Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు కలకలం రేపాయి.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 16 Nov 2026 4:21 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి లైంగిక వేధింపుల కలకలం!

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దారుణం వెలుగుచూసింది. పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రొద్దుటూరు ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నరసింహారెడ్డి అనే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు.

సబ్జెక్టు గురించి మాట్లాడాలంటూ విద్యార్థులను ప్రత్యేక గదిలోకి పిలిపించుకుని, అసభ్య పదజాలంతో దూషిస్తూ, శారీరకంగా అసభ్యంగా తాకుతూ వేధిస్తున్నాడని బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ​విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు.

అయితే తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాలకు వస్తున్నాయని తెలిసి సదరు ఉపాధ్యాయుడు సెలవు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా.. తాను విద్యార్థులను కేవలం మందలించాను తప్ప ఎలాంటి అసభ్య ప్రవర్తనకు పాల్పడలేదని ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి చెప్పినట్లు ఆయన తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR