Proddatur: ప్రొద్దుటూరు దసరా ఎగ్జిబిషన్ వేలం: రూ.1.85 కోట్లకు ఖరారు
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు దసరా ఫెస్టివల్ ఎగ్జిబిషన్ హక్కులను బాక్స్ టెండర్‌లో రూ.1,85,00,070 పలికి శివకుమార్ సొంతం చేసుకున్నారు.
Proddatur: ప్రొద్దుటూరు దసరా ఎగ్జిబిషన్ వేలం: రూ.1.85 కోట్లకు ఖరారు
కడప జిల్లా: ప్రొద్దుటూరులో ప్రసిద్ధి చెందిన దసరా ఫెస్టివల్ ఎగ్జిబిషన్ వేలం పాట అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మునిసిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సమక్షంలో ఈ వేలం పాట నిర్వహించారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో దాదాపు 45 రోజుల పాటు ఘనంగా జరిగే ఈ దసరా ఎగ్జిబిషన్ వేలం పాట కోసం మొత్తం 10 మంది పాటదారులు పోటీ పడ్డారు. గత మూడు సంవత్సరాల సగటును ప్రామాణికంగా తీసుకుని మున్సిపల్ అధికారులు మొదటగా ప్రారంభ ధరను ₹1,62,00,000 (కోటి 62 లక్షల రూపాయలు) గా నిర్ణయించారు. పాటదారుల మధ్య పోటాపోటీగా సాగిన ఓపెన్ వేలం పాటలో టోకెన్ నెంబర్ 6 కి చెందిన శివకుమార్ ₹1,69,10,000 (కోటి 69 లక్షల 10 వేల రూపాయలు) పలికి ముందంజలో నిలిచారు.
అనంతరం అధికారులు నిర్వహించిన బాక్స్ టెండర్ ప్రక్రియలో కూడా శివకుమార్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. బాక్స్ టెండర్‌లో అత్యధికంగా ₹1,85,000,70(కోటి 85 లక్షల 70 రూపాయలు) నమోదు చేసి, ఈ దసరా ఎగ్జిబిషన్ వేలం పాటను దక్కించుకున్నార.. మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ పోటీ తీవ్రంగా జరిగినప్పటికీ, చివరికి ఓపెన్ వేలంతో పాటు బాక్స్ టెండర్‌లోనూ అత్యధిక మొత్తాన్ని పలికిన శివకుమార్ ఎగ్జిబిషన్ హక్కులను సొంతం చేసుకోవడంతో వేలం పాట ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.
ఎగ్జిబిషన్‌లో అన్ని రుసుములను నియమ నిబంధనల ప్రకారమే వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ శివకుమార్‌కు సూచించారు. వేలం పాట ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్, రెవెన్యూ విభాగాలకు కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు.




