Proddatur: విద్యుత్ షాక్‌కు గురైన విద్యార్థి సందీప్ పరామర్శ
Proddatur: ప్రొద్దుటూరులో విద్యుత్ షాక్‌తో గాయపడి ఆసుపత్రిలో ఉన్న విద్యార్థి సందీప్‌ను పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్. మెరుగైన వైద్యం అందించాలని సూచన.
Proddatur: విద్యుత్ షాక్‌కు గురైన విద్యార్థి సందీప్ పరామర్శ
ప్రొద్దటూరు: ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన సందీప్ (16) అనే పాలిటెక్నిక్ విద్యార్థిని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పరామర్శించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఆయన గాంధీరోడ్డులోని హోలిస్టిక్ ఆస్పత్రికి చేరుకుని, ఐసీయూలో ఉన్న సందీప్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ జయచంద్ర రెడ్డి అడిగి తెలుసుకున్నారు.. సందీప్ కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కమిషనర్, మున్సిపల్ పరిధిలోని వినాయక మండపాలు, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు.




