Proddatur: పారిశుధ్య కార్మికుల పిల్లలతో ప్రొద్దుటూరు కమిషనర్ ముఖాముఖి!

Proddatur: అక్టోబర్ 2న ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల పిల్లలతో ఆత్మీయ ముఖాముఖి కార్యక్రమం.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 29 Sept 2026 12:51 PM IST
Proddatur
X

Proddatur: పారిశుధ్య కార్మికుల పిల్లలతో ప్రొద్దుటూరు కమిషనర్ ముఖాముఖి!

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీ తూతిక శ్రీనివాస విశ్వనాధ్​అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్బంగా ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మున్సిపల్ కమిషనర్ ఛాంబర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల పిల్లలలో డిగ్రీ మరియు ఆపై ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులతో కమిషనర్ ముఖాముఖిగా మాట్లాడనున్నారు.

విద్యార్థుల ప్రతిభ, ఆశయాలు మరియు కెరీర్ లక్ష్యాలను తెలుసుకుని, వారి భవిష్యత్తుకు అవసరమైన సరైన దిశానిర్దేశం, ప్రోత్సాహాన్ని అందిస్తారు. కేవలం సందేశానికే పరిమితం కాకుండా, వారి విద్య మరియు భవిష్యత్తు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని పారిశుధ్య కార్మికుల పిల్లలలోని ప్రతిభను వెలికితీసి, వారిని మరింతగా ప్రోత్సహించే ఈ మహోన్నత ఆత్మీయ కార్యక్రమానికి విజవంతం చేయాలనీ కమిషనర్ కోరారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR