Proddatur: ప్రొద్దుటూరులో వినూత్నంగా "కాఫీ విత్ కమీషనర్"
Proddatur: రాష్ట్రంలో తొలిసారిగా ప్రొద్దుటూరులో పారిశుధ్య కార్మికుల పిల్లలతో "కాఫీ విత్ కమీషనర్" నిర్వహించారు. ఉన్నత విద్య, ఆత్మవిశ్వాసంపై కమీషనర్ దిశానిర్దేశం చేశారు.
Proddatur: ప్రొద్దుటూరులో వినూత్నంగా "కాఫీ విత్ కమీషనర్"
Proddatur: పారిశుధ్య కార్మికుల పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, ఉన్నత చదువులపై ఆసక్తి కలిగించడమే లక్ష్యంగా మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
మొదటి దశలో బి.టెక్, డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన 35 మంది పారిశుధ్య కార్మికుల పిల్లలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కృషి, పట్టుదలతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి మహనీయులు ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు.
సమాజంలో సోషల్ స్టేటస్, ఆర్థిక అభివృద్ధి, గౌరవం పెరగాలంటే విద్య ఒక్కటే సరైన మార్గమని ఉద్బోధించారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్నాక్స్, కాఫీ స్వీకరించారు.
రాష్ట్రంలోనే మొదటిసారిగా నిర్వహించిన ఈ ప్రత్యేక చొరవపై పారిశుధ్య కార్మికులు, ప్రజా సంఘాలు మరియు నాయకులు కమీషనర్ శ్రీనివాస విశ్వనాథ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.




